Ghaziabad: జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం.. నిర్వాహ‌కుడిని చితక్కొట్టిన‌ కస్టమర్లు.. వీడియో వైర‌ల్‌!

Ghaziabad Vendor Arrested For Serving Juice Mixed With Urine

  • యూపీలోని ఘజియాబాద్‌లో ఘ‌ట‌న‌
  • జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయిస్తున్న య‌జ‌మాని అమీర్ ఖాన్‌
  • అక్క‌డ జ్యూస్ తాగుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు దాని రుచిలో తేడా అనిపించ‌డంతో విచార‌ణ‌
  • దాంతో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన వైనం

యూపీలోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి పండ్ల జ్యూస్‌లో మానవ మూత్రాన్ని (యూరిన్) కలిపి విక్రయించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ విషయం కస్టమర్లకు తెలియయడంతో జ్యూస్ షాపు యజమానిని చితక్కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాపు యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల‌ మైన‌ర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌లోని బోర్డర్ ప్రాంతమైన ఇందిరాపురిలో ఈ ఘటన జరిగింది. అమీర్ ఖాన్ అనే వ్యక్తి స్థానికంగా ఖుషీ జ్యూస్ పాయింట్‌ను నడుపుతున్నాడు. అయితే, గ‌త కొన్నిరోజులుగా అత‌ను విక్ర‌యిస్తున్న‌ జ్యూస్ రుచిలో తేడా ఉండ‌డంతో స్థానికులు విచారణ చేపట్టగా ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు జ్యూస్ లో మానవ మూత్రం కలిపి కస్టమర్లకు అందిస్తున్న‌ట్లు గుర్తించారు. 

దీంతో అక్క‌డివారు అమీర్ ఖాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శుక్రవారం నాడు తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల నుంచి అమీర్ ఖాన్ ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్లో పనిచేసే మైనర్ ను స్టేషన్ కు తరలించారు. కాగా, ఖుషీ జ్యూస్ కార్నర్‌లో మూత్రం డబ్బా దొరికిందని పోలీసులు తెలిపారు. జ్యూస్, మానవ మూత్రం నమూనాలను ప‌రీక్ష‌ల కోసం ల్యాబ్‌కు పంపారు. 

ఖుషీ జ్యూస్ కార్నర్ విక్రయదారులు జ్యూస్‌లో మానవ మూత్రాన్ని కలుపుతున్నారని లోని బోర్డర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు సమాచారం అందిందని ఘజియాబాద్ ఏసీపీ అంకుర్ విహార్ తెలిపారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

"షాప్ నుండి ఒక లీటరు మానవ మూత్రం ఉన్న డబ్బా దొరికింది. విచారించినప్పుడు దుకాణదారులు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. పోలీసులు వెంటనే అమీర్‌ను, అతని మైనర్ సహచరుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశాం. ద‌ర్యాప్తు జ‌రుగుతోంది" అని తెలిపారు.

  • Loading...

More Telugu News