Amaravati: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం

low pressure in bay of bengal in next 24 hours

  • ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం 
  • 20వ తేదీ నుండి కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు

రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుందని తెలిపింది.

దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటిన తర్వాత ఈ నెల 18నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. మరో వైపు రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. 

అలాగే ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది 28 నాటికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 20 నుండి అక్టోబర్ మొదటి వారం వరకూ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Amaravati
Bay Of Bengal
IMD
Low Pressure
  • Loading...

More Telugu News