Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు
![CM Chandrababu arrives Delhi](https://imgd.ap7am.com/thumbnail/cr-20240913tn66e468b62b7d5.jpg)
- ఈ సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు
- ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన పార్టీ వర్గాలు
- సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయన కొద్దిసేపటి కిందట హస్తినలో అడుగుపెట్టారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ వర్గాలు స్వాగతం పలికాయి. అనంతరం, జేఎన్ యూలో కమ్యూనిస్టు అగ్రనేత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాగా, చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు రాష్ట్రానికి తిరిగిరానున్నారు.