G. Kishan Reddy: వారికి ప్రధాని మోదీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించారు: కిషన్ రెడ్డి

Kishan Reddy about health insurance to Old age people

  • వయోవృద్ధులకు మోదీ ఆపన్నహస్తం అందించారన్న కిషన్ రెడ్డి
  • పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రయోజనం కలుగుతుందన్న కేంద్రమంత్రి
  • ఈ పథకం కోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్న కిషన్ రెడ్డి

70 ఏళ్లు దాటిన వారందరికీ ప్రధాని నరేంద్రమోదీ రూ.5 లక్షల ఆరోగ్య బీమాను కల్పించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. వయోవృద్ధుల సంక్షేమానికి ప్రధాని మోదీ ఆపన్న హస్తం అందించారన్నారు. అందుకే ఈ ఆరోగ్య బీమాను తీసుకువచ్చారని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా 6 కోట్ల మంది వయోవృద్ధులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

రానున్న రెండేళ్లలో ఈ పథకంపై రూ.3,437 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందన్నారు. దీంతో తెలంగాణ నుంచి మరో 10 లక్షలమంది వయోవృద్ధులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక గుర్తింపులు కార్డులు ఇస్తామని తెలిపారు. 

ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న కుటుంబాల్లోని 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు అదనంగా ఏడాదికి రూ.5 లక్షల టాప్ అప్ కవర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. వయోవృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 16న మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాగపూర్-హైదరాబాద్, దుర్గ్-విశాఖ మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధిక వందేభారత్ రైళ్లు నడుస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News