Revanth Reddy: వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy meeting with Centre Team

  • సచివాలయంలో సీఎంతో కేంద్ర బృందం సమావేశం
  • వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
  • శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచన

తెలంగాణలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రనష్టం సంభవించింది. ఈ క్రమంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం ఏపీ, తెలంగాణలలో పర్యటించింది. కేంద్రబృందం సభ్యులు నేడు సచివాలయంలో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు.

తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వరదల నివారణకు శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలన్నారు.

తెలంగాణలో వరద వల్ల జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయానికి నిధులు అందించాలని కోరారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News