Vande Bharat Mission: కొత్తగా మరో 10 వందేభారత్ రైళ్లు... ఎప్పటినుంచి అంటే...!

Ten new vande bharat express trains to be launched by pm modi on september 15th

  • మరో పది వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • ఈ నెల 15న కొత్త వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపనున్న ప్రధాని 
  • కీలక మార్గాలలో పట్టాలపై పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు

దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పట్టాలపై దూసుకువెళుతున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుండి లక్నో, మథురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్‌లను కలుపుతూ ఈ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. వందే భారత్ ట్రైన్‌ల పట్ల ప్రయాణికుల నుండి విశేష స్పందన లభిస్తోంది. 

సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో సుఖవంతంగా ప్రయాణించే అవకాశం ఉండటంతో వందే భారత్ ట్రైన్‌లను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. దీంతో మరి కొన్ని రూట్లలో కొత్త వందే భారత్ ట్రైన్ లను రైల్వే శాఖ సిద్ధం చేసింది. మరో పది వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఈ నెలలోనే మరో పది వందే భారత్ ట్రైన్ లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న పీఎం మోదీ పది ట్రైన్లను వర్చువల్ గా ప్రారంభిస్తారు. 

ఏయే మార్గాలలో అంటే..
టాటా నగర్ – పాట్నా, వారణాసి – దియోఘర్, రాంచీ – గొడ్డ, దుర్గ్ – విశాఖపట్నం, టాటా నగర్ – బెర్హంపూర్ (ఒడిసా) రూర్కెలా – హౌరా, హౌరా – గయా, ఆగ్రా – వారణాసి సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే క్రమంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నారు. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ రైళ్లు హైస్పీడ్ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.

  • Loading...

More Telugu News