Mamata Banerjee: అవసరమైతే రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

Mamata Banarjee says if needed she will ready to resign

  • కొనసాగుతున్న కోల్ కతా హత్యాచార ఘటన ప్రకంపనలు
  • వైద్యులు సమ్మె విడనాడాలన్న సీఎం మమతా బెనర్జీ
  • హత్యాచార కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని వెల్లడి

కోల్ కతా హత్యాచార ఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రజాప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకైనా తాను సిద్ధమని ప్రకటించారు. మృతురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 

డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం నిన్న రెండు గంటల పాటు ఎదురుచూశానని మమతా బెనర్జీ వెల్లడించారు. డాక్టర్లతో చర్చలకు ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించానని తెలిపారు. 

హత్యాచార కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని మమతా పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లతో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని స్పష్టం చేశారు. భేటీపై వీడియో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతితో ఫుటేజిని డాక్టర్లకు అందజేస్తామని అన్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News