Harish Rao: హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao fires at Revanth Reddy government

  • అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చచ్చిపోయిందని ఆగ్రహం
  • హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మండిపాటు
  • కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య

హైడ్రా పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చచ్చిపోయిందన్నారు.

కొద్దికాలంలోనే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చారో లేదో అప్పుడే రూ.800 కోట్ల ఉపాధి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. 

ఈ తొమ్మిది నెలల్లో రెండు పెన్షన్లను ఎగ్గొట్టారన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, దీంతో చాలామంది రోగాల బారిన పడుతున్నారన్నారు. మెట్రో రైలు, ఫార్మా సిటీ అంశంలోనూ మాట మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం రైతులకు మించి రుణమాఫీ జరగలేదన్నారు.

  • Loading...

More Telugu News