SEB: 'సెబ్' ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt abarted SEB

  • సెబ్ ను ఏర్పాటు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం
  • గత ప్రభుత్వం జారీ చేసి జీవో నెం.12ను రద్దు చేసిన కూటమి సర్కారు
  • సెబ్ విభాగానికి కేటాయించిన ఉద్యోగుల రిలీవ్
  • సెబ్ ఉద్యోగులు ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'సెబ్' ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.12ను కూటమి ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. 

'సెబ్' విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేసింది. ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని 'సెబ్' సిబ్బందికి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. 'సెబ్' కు చెందిన వాహనాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని 'సెబ్' కు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 'సెబ్' ఇన్నాళ్లూ ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా పనిచేసింది.

SEB
AP Govt
Excise Dept
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News