Cabinet Sub Committee: ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

AP Cabinet Sub Committee established to study new liquor policy

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • త్వరలో రాష్ట్రంలో నూతన మద్యం విధానం
  • ఈ నెలాఖరుతో ముగియనున్న పాత మద్యం పాలసీ

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. 

ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది. అంతేకాకుండా, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. 

ఇప్పటికే అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. నూతన మద్యం విధానంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది.

  • Loading...

More Telugu News