IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్‌పై వింగ్ కమాండర్ అత్యాచారం!
- జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘటన
- గతేడాది డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో న్యూ ఇయర్ పార్టీ
- గిఫ్ట్ ఇస్తానని రూముకు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత అధికారిణి ఫిర్యాదు
- ఆమె ఆరోపణలను కొట్టిపడేసిన అంతర్గత కమిటీ
తన సీనియర్ అయిన వింగ్ కమాండర్ ఒకరు తనపై లైంగికదాడికి పాల్పడినట్టు మహిళా ఫ్లయింగ్ ఆఫీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గతేడాది డిసెంబర్ 31న నిర్వహించిన పార్టీ అనంతరం గిఫ్ట్ ఇస్తానని రూముకు పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను గదిలోకి వెళ్లగానే ఆయన భార్య, పిల్లల గురించి అడిగానని, దానికి ఆయన ఎక్కడో ఉన్నారులే.. అని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తనను వేధించి ముఖ రతికి బలవంతం చేశాడని ఆరోపించారు. ఇక ఆపాలని ఆయనను పదేపదే వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అతడిని బలంగా నెట్టేసి తాను గది నుంచి పరుగులు పెట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న బుద్గాం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఐఏఎఫ్ అంతర్గత కమిటీ మాత్రం బాధిత ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపణలను తోసిపుచ్చింది.