Stock Market: లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

Sensex closes up by 361 pts IT stocks lead

  • 361 పాయింట్ల లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
  • లాభపడిన నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్
  • అదరగొట్టిన ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు లాభాల్లో ముగిసింది. ఐటీ స్టాక్స్ అదరగొట్టడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు లాభపడి 81,921 వద్ద ముగియగా... నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 25,041 వద్ద స్థిరపడింది. 

మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 691 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 220 పాయింట్లు లాభపడ్డాయి.

రంగాలవారీగా చూస్తే ఐటీ, ఫార్మా, మెటల్, ఆటో, రియాల్టీ, ఎనర్జీ స్టాక్స్ లాభపడగా... పీఎస్‌యూ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టపోయాయి. 

సెన్సెక్స్-30 స్టాక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, టైటాన్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, ఎల్ అండ్ టీ టాప్ గెయినర్లుగా... బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి.

More Telugu News