Viral Videos: గులాబీ పువ్వుల పకోడి ఎప్పుడైనా తిన్నారా... వీడియో ఇదిగో

A video of a street vendor selling rose pakodas recently went viral on social media

  • శనగ పిండి మిశ్రమంలో గులాబీలను ముంచి పకోడీలు తయారు చేసిన వీధి వ్యాపారి
  • వేడి వేడి పకోడీలు ఆస్వాదిస్తున్న కస్టమర్లు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

రకరకాల పకోడీల గురించి వినే ఉంటారు... తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా గులాబీ పువ్వుల పకోడీ తిన్నారా? ఇది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా నిజం. ‘స్ట్రీట్ ఫుడ్స్‌’ జాబితాలో రోజా పువ్వుల పకోడీ కొత్తగా చేరిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓమ్నివియామ్ మీడియా‌కు చెందిన పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘బ్లెస్డ్ ఇండియన్ ఫుడీ’ ఈ వీడియోను షేర్ చేసింది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి గులాబీ పువ్వులతో పకోడీలను తయారు చేయడం ఈ వీడియోలో ఉంది. ఇతర పకోడీల మాదిరిగానే గులాబీ పకోడీలను కూడా తయారు చేయడం వీడియోలో కనిపించింది. 

ముందుగా అతడు రోజా పువ్వులకు ఉన్న పొడవాటి తొడిమలను కత్తిరించాడు. నీళ్లు, శెనగపిండి, ఇతర కావాల్సిన పదార్థాలు కలిపిన మిశ్రమంలో గులాబీలను ముంచి దానిని మరుగుతున్న ఆయిల్‌లో వేసి వేయించాడు. మంచిగా వేగిన తర్వాత బయటకు తీసి విక్రయించాడు. వేడివేడి గులాజీ పకోడీని ఓ వ్యక్తి ఆరగించడం కూడా వీడియోలో కనిపించింది.

జులైలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. 61 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా లక్షలాది లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోను భారత్‌లోనే తీసినప్పటికీ ఎక్కడ తీశారనే వివరాలు తెలియరాలేదు.  

కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన స్ట్రీట్ ఫుడ్ అని కామెంట్లు పెడుతున్నారు. వ్యాపారి దగ్గర సృజనాత్మకత ఉందని, పరిశుభ్రంగా గులాబీ పకోడీలు తయారు చేస్తున్నాడని మెచ్చుకున్నారు. నమ్మలేక పోతున్నామని మరికొందరు కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by Blessed Indian Foodie by Omniviam Media (@blessedindianfoodie)

  • Loading...

More Telugu News