Aishwarya Rajesh: కష్టాలన్నీ ఒకేసారి అనుభవించాం: ఐశ్వర్య రాజేశ్ తల్లి నాగమణి

Aishwarya Raiesh Mother Nagamani Interview

  • 'మేము తెలుగువాళ్లమే, మాది గుంటూరు' అన్న నాగమణి 
  • రాజేశ్ మరణంతో ఒంటరిపోరాటం చేశానని వెల్లడి 
  • పెద్దబ్బాయి, రెండో అబ్బాయి మరణాలు కుంగదీశాయని వ్యాఖ్య    
  • ఐశ్వర్య 16వ యేట నుంచే నటించడం మొదలుపెట్టిందని వెల్లడి  


ఐశ్వర్య రాజేశ్ .. తెలుగు - తమిళ భాషల్లో ఆమెకి ఎంతో క్రేజ్ ఉంది. తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే నయనతార - త్రిష తరువాత వినిపించే పేరు ఐశ్వర్య రాజేశ్. 'ఫర్హానా' .. 'డ్రైవర్ జమున' అనే ఓటీటీ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆమె తల్లి నాగమణి కెమెరా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగమణి మాట్లాడారు.

"మేము తెలుగు వాళ్లమే .. మాది గుంటూరు. రాజేశ్ తో పరిచయమయ్యే సమయానికి నేను అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసేదానిని. రాజేశ్ చనిపోవడంతో నలుగురు పిల్లలతో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను చిన్నాచితక పనులు చాలా చేశాను. ఒంటరిగా ఈ నావను తీరానికి దగ్గరగా తీసుకుని వెళ్లగలుగుతున్నానని అనుకుంటూ ఉండగా , పెద్దబ్బాయి .. రెండో అబ్బాయి ఇద్దరూ చనిపోయారు" అన్నారు. 

"పిల్లలిద్దరూ చనిపోయిన తరువాత ఇక జీవితమే లేదని అనుకున్నాను. కానీ మిగిలిన ఇద్దరు పిల్లల కోసం కష్టాలను ఈదుకుంటూ వెళ్లవలసి వచ్చింది. కష్టాలన్నీ ఒక్కసారిగా అనుభవించేశాము. ఐశ్వర్య రాజేశ్ తన 16వ యేట నుంచే నటించడం మొదలుపెట్టింది. ఆ తరువాత ఎన్నో కష్టాలు పడుతూ మంచి పేరు సంపాదించుకోవడం సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది" అని చెప్పారు.

  • Loading...

More Telugu News