Andhra Pradesh: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన కేసు... ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

Investigation on into collision of five boats with Prakasam Barrage

  • మూడు పడవలను ఉషాద్రికి చెందినవిగా గుర్తించిన పోలీసులు
  • ఉషాద్రితో పాటు రామ్మోహన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పోలీసులు
  • ఘటనలో యజమానుల నిర్లక్ష్యం ఉందని గుర్తించిన పోలీసులు

ప్రకాశం బ్యారేజీని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాఫ్తు చేపట్టారు. బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన వాటిలో మూడు పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితో పాటు సూరాయపాలెంకు చెందిన రామ్మోహన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకు తరలించారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను నాలుగు పడవలు బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఈ పడవల కోసం తామే యజమానులం అంటూ ఎవరూ రాలేదు. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ఈ ఘటనలో యజమానుల నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఏమైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News