HYDRA: నిర్మాణాలకు అనుమతులపై హైడ్రా కేసులు... ప్రభుత్వ ఉద్యోగుల ముందస్తు బెయిల్ పిటిషన్

Government officers files bail petition in Court

  • అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
  • అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఫిర్యాదులు
  • కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాల అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. చందానగర్, బాచుపల్లిలోని ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి.

దీంతో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, ల్యాండ్ అండ్ రికార్డ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వవద్దంటూ సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News