Harish Rao: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Former Minister Harish Rao Reaction On Telangana High Court Verdict

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని వెల్లడి
  • ఆ నియోజకవర్గాల్లో త్వరలో ఉపఎన్నికలు జరుగుతాయని వెల్లడి
  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కోర్టు తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • బైపోల్స్ లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా

బీఆర్ఎస్ టికెట్ తో గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. ఈ విషయంలో సోమవారం హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన స్వాగతించారు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని అన్నారు. అదేవిధంగా వారిపై వేటు పడక తప్పదని, త్వరలోనే ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని వివరించారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.

హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టేలా ఉందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.

  • Loading...

More Telugu News