Chiranjeevi: చిరంజీవి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

Mega star Chiranjeevi Vinayaka Chavithi Greetings

 


నేడు వినాయక చవితి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు అటు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా సినీ ప్ర‌ముఖులు గణేశ్‌ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. "విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు" అంటూ చిరు ట్వీట్ చేశారు.

More Telugu News