Jr NTR: 'దేవ‌ర' ట్రైల‌ర్‌పై తార‌క్ కీల‌క అప్‌డేట్

Jr NTR Tweet on Devara Part1 Trailer Release Date

  • ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో దేవ‌ర‌
  • ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల
  • 'ఎక్స్' వేదిక‌గా వినాయ‌క చ‌వితి విషెస్ తెలిపిన ఎన్‌టీఆర్‌
  • ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను ఈ నెల 10న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

యంగ్‌టైగ‌ర్ ఎన్‌టీఆర్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ దేవ‌ర‌. రెండు పార్టులుగా ఈ సినిమా రానుంది. మొద‌టి పార్ట్ ఈ నెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత తార‌క్‌, కొర‌టాల కాంబోలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో దేవ‌ర‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

ఈ క్ర‌మంలో నేడు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఎన్‌టీఆర్ మూవీ ట్రైల‌ర్‌పై తాజాగా కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. దేవ‌ర ట్రైల‌ర్‌ను ఈ నెల 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించారు. అలాగే అంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలుపుతూ తార‌క్ ట్వీట్ చేశారు. 

'మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ వ‌స్తుంది' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

దేవ‌ర‌లో తార‌క్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా చేస్తుండ‌గా, మ‌రో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. త‌మిళ యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన దేవ‌ర‌ సాంగ్స్‌, గ్లింప్స్‌తో మూవీపై  అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.

More Telugu News