Chandrababu: ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్ ను వేగవంతం చేయండి: చంద్రబాబు

Chandrababu teleconference on flood relief works
  • వరద సహాయక చర్యలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
  • టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రులు, అధికారులు
  • పారిశుద్ధ్య పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు
విజయవాడ వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరగుతున్న పారిశుద్ధ్య పనులపై వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 

ఫైరింజన్లతో వరద ప్రాంతాల్లోని రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. వాహనాలు, ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో... ఇతర ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియన్లను పిలిపించాలని చెప్పారు. 

బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్ధరణ, ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా తదితర వివరాలను తెలుసుకున్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు కూడా పాల్గొన్నారు.
Chandrababu
Telugudesam
Floods

More Telugu News