Andhra Pradesh: భారీ వరదలు... ఏపీ, తెలంగాణలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందన్న హోంశాఖ

Central Government promises to AP and Telangana
  • వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపినట్లు వెల్లడి
  • వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందన్న హోంశాఖ
  • రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, వైమానిక హెలికాప్టర్లు పాల్గొంటున్నట్లు వెల్లడి
ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సహాయక చర్యలపై ఎక్స్ వేదికగా కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించినట్లు తెలిపింది.

వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానిక హెలికాప్టర్లు ఉన్నాయని తెలిపింది. ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నట్లు తెలిపింది.
Andhra Pradesh
Telangana
Central Government

More Telugu News