Jagan: జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు... లండన్ పర్యటన వాయిదా

Passport troubles to Jagan

  • జగన్ డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దు
  • కోర్టు నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలన్న పాస్ పోర్ట్ కార్యాలయం
  • ఎన్ఓసీ ఇప్పించాలని హైకోర్టును కోరిన జగన్ న్యాయవాది

వైసీపీ అధినేత జగన్ కు పాస్ పోర్ట్ కష్టాలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమేటిక్ పాస్ పోర్ట్ రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ క్రమంలో జగన్ కు ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్ పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి పరిమితం చేసింది. మరోవైపు ఎన్ఓసీ తెచ్చుకోవాలంటూ జగన్ కు పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

వాదనల సందర్భంగా జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... లండన్ పర్యటనకు జగన్ కు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. మరోవైపు పాస్ పోర్ట్ కార్యాలయం న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జగన్ పై ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకురావాలని జగన్ కు పాస్ పోర్టు కార్యాలయం లేఖ కూడా రాసిందని చెప్పారు. 

దీంతో, పాస్ పోర్టు కోసం జగన్ కు ఎన్ఓసీని ఇప్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పాస్ పోర్టు ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది.

  • Loading...

More Telugu News