Infertility: వాయు కాలుష్యంతో పురుషుల్లో సంతాన లేమి!

Study Finds Connection Between Air Pollution And Male Infertility

  • దీర్ఘకాలంపాటు పీఎం 2.5కి గురైతే పురుషుల్లో వంధ్యత్వం
  • డెన్మార్క్‌లోని నార్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
  • 2000 నుంచి 2017 వరకు 5 లక్షల మందిపై అధ్యయనం
  • ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకదానికి సంతాన లేమి సమస్య

వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

ప్రపంచంలోని ప్రతి ఏడుగురు జంటల్లో ఒకటి సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది.

ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు పెరగాలంటే వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు నివారించాల్సిన అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది. నాణ్యమైన గాలిని పొందడం మానవ హక్కు అని, కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News