Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

BRS leader Jitta Balakrishna Reddy passes away

  • కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న జిట్టా
  • సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూత
  • భువనగిరిలోని ఫామ్ హౌస్ లో ఈ సాయంత్రం అంత్యక్రియలు

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. 

జిట్టా బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరికి కుటుంబసభ్యులు తరలించారు. ఈ సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. 

తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. 2009లో ఆయన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి... వైసీపీలో చేరారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 'యువ తెలంగాణ పార్టీ'ని స్థాపించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 

ఆర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో... కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో జిట్టాకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. ఇంతలోనే ఆయన అనారోగ్యం బారిన పడటం, తిరిగిరాని లోకాలను వెళ్లిపోవడం జరిగిపోయింది. జిట్టా మృతి పట్ల రాజకీయ నాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

  • Loading...

More Telugu News