Floods: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ.. ఏయే సరుకులు ఉంటాయంటే..?

Glossary kits distribution in AP for flood victims

  • తొలి రోజు 50 వేల కిట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు
  • కిట్లలో బియ్యం, కందిపప్పు, ఉల్లి, బంగాళాదుంపలు, నూనె, పంచదార
  • మొత్తం 2 లక్షల కుటుంబాలకు కిట్లు అందించేందుకు ఏర్పాట్లు

భారీ వర్షాలకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాత్రింబవళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఈరోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయనున్నారు. తొలిరోజు 50 వేల కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కిట్ లో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు, లీటర్ నూనె ఉంటాయి. మొత్తం 2 లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-పోస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లను పంపిణీ చేస్తారు.

More Telugu News