Rajasthan: ప్రేక్షకుల మధ్య ఉన్న చిన్ననాటి గురువును గుర్తుపట్టి... వెళ్లి పాదాభివందనం చేసిన రాజస్థాన్ సీఎం

Rajasthan CM gets emotional touches his teacher feet

  • ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జైపూర్‌లో సన్మాన కార్యక్రమం
  • ప్రేక్షకుల మధ్య ఉన్న తన టీచర్‌ను గుర్తించిన సీఎం భజన్ లాల్ శర్మ
  • స్టేజ్ దిగి వెళ్లి గురువు కాళ్లకు నమస్కరించిన ముఖ్యమంత్రి

నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జైపూర్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తన గురువు శంకర్ లాల్ శర్మకు పాదాభివందనం చేసి, భావోద్వేగానికి గురయ్యారు. జైపూర్‌లో సన్మాన కార్యక్రమం జరుగుతుండగా ప్రేక్షకుల మధ్య కూర్చున్న తన గురువును ముఖ్యమంత్రి గుర్తించారు. ఆయన స్వయంగా స్టేజ్ నుంచి కిందకు దిగి వచ్చి తన గురువు పాదాలను తాకారు. ఆ తర్వాత ఆయనను స్టేజ్ పైకి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మట్టిని పిసికి అందమైన విగ్రహాన్ని తయారు చేసే కుమ్మరుల వంటివారే ఉపాధ్యాయులు అన్నారు. వారి అంకితభావానికి వెలకట్టలేమని తెలిపారు. విద్యార్థుల విజయానికి అహర్నిశలు కృషి చేస్తారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సీఎం తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజుల్లో పాఠశాలలో పిల్లవాడిని చేర్పించిన రోజును ఎంతో శుభదినంగా భావించేవారని, స్కూల్లో చేర్పించాక బెల్లం పంచేవారని గుర్తు చేసుకున్నారు. 

తాను స్కూల్‌ లో చేరిన సమయంలో శంకర్ లాల్ ఒక్కరే ఉపాధ్యాయుడుగా ఉన్నారని, తనకు ఐదో తరగతి వరకు ఆయన చదువు చెప్పాడన్నారు.

  • Loading...

More Telugu News