Andhra Pradesh: వరదల కారణంగా ఏపీలో ఎంత మంది చనిపోయారంటే...?

32 dead in AP due to floods

  • ఏపీ వ్యాప్తంగా 32 మంది మృతి
  • ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 24 మంది మృతి
  • 3,973 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్న వైనం

ఏపీలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్నే మిగిల్చాయి. జల విలయం కారణంగా ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. 

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 24 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారని పేర్కొంది. 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయారని తెలిపింది. 1,69,370 ఎకరాల్లో పంట... 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగిందని చెప్పింది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయని వెల్లడించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 3,973 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది. 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. 193 పునరావాస కేంద్రాల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. 50 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు పని చేస్తున్నాయని చెప్పింది.

Andhra Pradesh
Floods
Deaths
  • Loading...

More Telugu News