Telangana: ఆ రెండు రోజులు సెలవు... తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Telangana Government gave holidays on Sep 7 and 17
  • సెప్టెంబర్ 7న వినాయక చవితి, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవులు
  • తొలుత సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవును ప్రకటించిన ప్రభుత్వం
  • నెలవంక దర్శనం తేదీని బట్టి తాజాగా సెలవు రోజును మార్చిన ప్రభుత్వం
గణేశ్ చతుర్దశి, మిలాద్ ఉన్ నబీ పర్వదినాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 17 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 7న వినాయక చవితి, 17న మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో సెలవులు ఇచ్చింది.

తెలంగాణలో సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం 7న గణేశ్ చతుర్థి, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీకి సెలవులుగా గతంలో నిర్ణయించారు. కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి మిలాద్ ఉన్ నబీ సెలవు దినం మార్చినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తొలుత నిర్ణయించిన 16వ తేదీన కాకుండా ఇప్పుడు 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది.
Telangana
Congress
Holidays

More Telugu News