Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
- 202 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 81 పాయింట్లు క్షీణించి 25,198 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ
- నష్టాల్లో ముగిసిన బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్
ప్రతికూల అంతర్జాతీయ సెంటిమెంట్ కారణంగా నేడు భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 202 పాయింట్లు క్షీణించి 82,352 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 25,198 వద్ద స్థిరపడింది.
బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 288 పాయింట్లు నష్టపోయి 51,400 వద్ద, నిఫ్టీ ఐటీ 400 పాయింట్లు క్షీణించి 42,450 వద్ద ముగిసింది.
ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫిన్ సర్వీస్, మెటల్, ఎనర్జీ సూచీలు నష్టాల్లో ముగియగా... ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, మీడియా రంగాలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఏషియన్ పేయింట్స్, హెచ్‌యూఎల్, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విప్రో, మహింద్రా అండ్ మహింద్రా, మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్ టాప్ లూజర్లుగా నిలిచాయి.