Manvat Murders: మహారాష్ట్రలో జరిగిన ఏడు హత్యల నేపథ్యమే కథగా 'సోనీ లివ్' సిరీస్!

Manvat Murders Web Series Update

  • సోనీలివ్ ట్రాక్ పైకి 'మన్వత్ మర్డర్స్'
  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సిరీస్
  • టీజర్ రిలీజ్ తరువాత పెరిగిన ఆసక్తి 
  • అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ 

సోనీలివ్ ఫ్లాట్ ఫామ్ పైకి ఒక మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ రావడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'మన్వత్ మర్డర్స్'. అశుతోశ్ గోవారికర్ .. మకరంద్ అనస్పూర్ తదితరులు నటించిన ఒక మరాఠీ సిరీస్ ఇది. ఆశిష్ బెండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నుంచి ఈ నెల 3వ తేదీన ఒక టీజర్ ను వదిలారు. అప్పటి నుంచి ఈ సిరీస్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. 

1972లో మహారాష్ట్ర ప్రాంతంలోని ఒక కుగ్రామంలో జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని రూపొందించిన సిరీస్ ఇది. ఆ గ్రామంలో నలుగురు ఆడపిల్లలు ..ముగ్గురు మహిళలు హత్యకి గురవుతారు. ఈ హత్యలను ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది స్థానిక పోలీస్ అధికారులకు అర్థం కాదు. ఏడాదిన్నర గడిచిపోయినా వాళ్లు ఈ హత్య కేసులను ఛేదించలేకపోతారు.

అప్పుడు ముంబైకి చెందిన పోలీస్ ఆఫీసర్ రమాకాంత్ కులకర్ణి రంగంలోకి దిగుతాడు. ఈ హత్య కేసులను ఆయన ఏ వైపు నుంచి పరిశోధన చేయడం మొదలుపెడతాడు? ఆ పరిశోధనలో ఆయనకి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 

  • Loading...

More Telugu News