Pawan Kalyan: ఏపీ సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan announces Rs 1 crore assistance to AP CM Relief Fund

  • విజయవాడలో వరద బీభత్సం
  • విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనితతో కలిసి సమీక్ష చేపట్టిన పవన్
  • రేపు చంద్రబాబును కలిసి విరాళం అందిస్తానని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీలో వరద పరిస్థితుల పట్ల ఆయన ఇవాళ  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. రేపు (సెప్టెంబరు 4) సీఎం చంద్రబాబును కలిసి రూ.1 కోటి విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

పవన్ ఇవాళ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను మానిటరింగ్ చేశారు. 

ఈ సందర్భంగా చేపట్టిన సమీక్షలో రాష్ట్ర హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Telugu News