Palamuru project: ముంచెత్తిన వరద.. నీట మునిగిన వెంకటాద్రి పంప్ హౌజ్

Flood water entered into Venkatadri Pump house at palamuru rangareddy lift irrigation project

  • పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోకి వరద
  • రూ. 10 కోట్లు నష్టం ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా
  • వరద నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు

తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌజ్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌజ్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించింది. తాజా వర్షాలకు వెంకటాద్రి పంప్‌ హౌజ్ లోని అండర్ టన్నెల్‌లోకి నీరు వచ్చి చేరింది.

  • Loading...

More Telugu News