Rs 2000 notes: రూ.2000 నోట్లకు సంబంధించి కీలక సమాచారం విడుదల చేసిన ఆర్బీఐ

only Rs 7261 crore worth of the Rs 2000 notes are still with the public says RBI

  • ఇంకా జనాల వద్దే రూ.7,261 కోట్ల విలువైన రెండు వేల నోట్లు ఉన్నాయన్న ఆర్బీఐ
  • ఆగస్టు నెల చివరి నాటికి 97.96 శాతం నోట్లు తిరిగి వచ్చాయని వెల్లడి
  • 19 కార్యాలయాల్లో ఇప్పటికీ ఈ పెద్ద నోట్లను స్వీకరిస్తున్న ఆర్బీఐ

చెలామణి నుంచి రూ.2000 నోట్లు ఉపసంహరించి చాలా కాలం అయింది. అయితే రూ.7,261 విలువైన ఈ పెద్ద నోట్లు ఇంకా జనాల వద్దే ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తం 97.96 శాతం నోట్లు తిరిగి తమ వద్దకు వచ్చాయని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను ప్రకటించింది.

కాగా రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023న ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు వ్యాపారాలు ముగిసే సమయానికి మొత్తం రూ.3.56 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే గత నెల ఆగస్టు చివరి రోజు ముగిసే సమయానికి ఈ విలువ రూ.7,261 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో 97.96 శాతం నోట్లు తిరిగి వచ్చాయని వివరించింది.

కాగా రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్చుకునే అవకాశం అక్టోబర్ 7, 2023తో ముగిసిపోయింది. అయితే అక్టోబరు 9, 2023 నుంచి ఆర్బీఐ శాఖా కార్యాలయాలు... వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. పోస్టాఫీసు నుంచి ఏదైనా ఆర్బీఐ కార్యాలయానికి ఇండియా పోస్ట్ ద్వారా పంపించి డిపాజిట్ చేసుకోవచ్చు. ఆర్బీఐ ఇష్యూ చేసిన 19 కార్యాలయాల జాబితాలో అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఉన్నాయి.

  • Loading...

More Telugu News