Balakrishna: నా భార్య వసుంధరకు ధన్యవాదాలు: బాలకృష్ణ

Balakrishna thanks his wife Vasundhara
  • తన ప్రతి అడుగులో తన భార్య ఉందన్న బాలకృష్ణ
  • అక్కినేని నాగేశ్వరరావు నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని వెల్లడి
  • త్వరలోనే 'అఖండ 2'ను ప్రారంభిస్తామన్న బాలయ్య
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ లో నిన్న సాయంత్రం స్వర్ణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ...  తాను వేసిన ప్రతి అడుగులో తనకు అండగా నిలిచిన తన భార్య వసుంధరకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ఇక, తన తండ్రి నుంచి తాను కేవలం నటన మాత్రమే కాకుండా క్రమశిక్షణ, సంస్కారం, సమయపాలన కూడా నేర్చుకున్నానని తెలిపారు. అదే విధంగా అక్కినేని నాగేశ్వరావు నుంచి అనేక విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. 

ఇప్పుడు తన కుటుంబం చాలా పెద్దదయిందని... తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఇలా ఎంతోమంది తన కుటుంబంలో ఉన్నారని అన్నారు. ఇది తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని చెప్పారు. సినీ, రాజకీయ, వైద్య రంగాల్లో తాను రాణిస్తున్నానంటే... దానికి కారణమైన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నారు. 

త్వరలోనే 'అఖండ 2' సినిమాను ప్రారంభించనున్నామని బాలయ్య వెల్లడించారు. కొత్తదనాన్ని అందిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని తాను నమ్ముతానని చెప్పారు.
Balakrishna
Telugudesam
Tollywood
Wife

More Telugu News