Allu Arjun: పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ట్వీట్ ఇదిగో!

Allu Arjun Tweet went Viral On Social Media

  • కొంతకాలంగా పవన్ కు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్
  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం
  • బన్నీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పీకే ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడం హైలైట్ గా మారింది. గత కొంతకాలంగా ఇరువురు హీరోల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలే దీనికి కారణం. ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య ఇటీవల పొసగడంలేదు. అల్లు అర్జున్ పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనికితోడు ఓ సినిమా రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మరింత పెరిగింది. హీరోల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

More Telugu News