Andhra Pradesh: ఏపీలో ఇవాళ వాతావరణ పరిస్థితి ఇదే.. అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన
- రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- అప్రమత్తం చేసిన అమరావతి వాాతావరణ కేంద్రం
భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇవాల్టి వాతావరణంపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక సమాచారం విడుదల చేసింది. ఇవాళ (ఆదివారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.
ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటనలో అమరావతి వాతావరణం కేంద్రం పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమ ప్రాంతంలో కూడా ఇదే వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణం కేంద్రం పేర్కొంది. అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అతి భార్షీలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు మెరుపులు, బలమైన ఉపరితల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
రానున్న 6 రోజులు వర్షాలే..
రానున్న 6 రోజులు కూడా ఏపీలో వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు ఎక్కువ అవకాశం ఉంది, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.