Royal enfield classic 350: క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 వెర్షన్ విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

2024 royal enfield classic 350 launched at rs 1 99 lakh best selling

  • నేటి నుంచి కొత్త మోడల్ బైక్ బుకింగ్ .. టెస్ట్‌రైడ్ లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన కంపెనీ
  • ఏడు కొత్త రంగులతో నూతన క్లాసిక్ 350 ఎన్‌ఫీల్డ్ బైక్ 
  • సెప్టెంబర్ 4వరకు బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెన్నై సందర్శనకు అవకాశం 

భారత మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త మోడల్ బైక్ తీసుకువచ్చింది. క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 ను విడుదల చేసింది. ఇందులో పలు వేరియంట్లు ఉన్నాయి. హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ) వేరియంట్ ధర రూ. 1,99,500 కాగా, హెరిటేజ్ ప్రీమియం (మెడలియన్ బ్రాంజ్) ధరను రూ. 2,04,000 గా నిర్ణయించింది. సిగ్నల్స్ (కమాండో శాండ్) ధర రూ. 2,16,000, డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్) ధర రూ. 2,25,000, క్రోమ్ (ఎమరాల్డ్ ) ధరను రూ. 2,30,000గా పేర్కొంది.

రీ మోడల్ చేసిన ఈ బైక్‌లో ఇప్పటికే ఉన్న మెకానికల్ భాగాలను కొనసాగిస్తూనే కొత్త కలర్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఎక్స్ ట్రా పార్ట్స్‌ను యాడ్ చేసింది. బైక్ బుకింగ్‌, టెస్ట్‌రైడ్‌లు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

ప్రత్యేకతలు ఇవే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదు వేరియంట్లలో ఏడు కొత్త కలర్ స్కీమ్‌లను ప్రకటించింది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్, ఇన్‌స్ట్రమెంట్ క్లస్టర్ పొజిషన్ ఇండికేటర్.. టైప్ సీ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. నేటి నుంచి 4 వరకూ కొత్త క్లాసిక్ 350 బుక్ చేసుకునే వినియోగదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ సౌకర్యాలను సందర్శించడానికి చెన్నైకి వెళ్లే అవకాశాన్ని కూడా పొందుతారని కంపెనీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News