Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించిన ఎన్నికల సంఘం

Haryana assembly polls now on Oct 5

  • అసోజ్ అమావాస్య పండుగ నేపథ్యంలో తేదీని సవరించిన ఈసీ
  • తొలుత అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల
  • బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తులతో అక్టోబర్ 5కు మార్పు

అసోజ్ అమావాస్య పండుగ నేపథ్యంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. తొలుత అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదలైంది. 

అయితే బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈసీ పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మార్చింది. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించినా... ఇప్పుడు ఎన్నికల తేదీని మార్చడంతో జమ్ము కశ్మీర్‌తో పాటు అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్ స్మారకంగా బిష్ణోయ్ కమ్యూనిటీ అసోజ్ అమావాస్య పండుగను నిర్వహిస్తుంది. అక్టోబర్ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌కు చెందిన ఈ కమ్యూనిటీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. 

ఈ క్రమంలో బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.

  • Loading...

More Telugu News