YS Sharmila: జగన్‌ బాటలోనే చంద్రబాబు: వైఎస్‌ షర్మిల విమర్శలు

YS Sharmila Sensational Comments on CM Chandrababu Naidu

  • వైద్య, విద్యా సంస్థలకు వైఎస్‌ఆర్ పేరును తొలగించడంపై ష‌ర్మిల ఫైర్‌
  • ఆనాడు మాజీ సీఎం జగన్ ఇదే ప‌నిచేసి పెద్ద త‌ప్పు చేశాడ‌ంటూ ట్వీట్
  • ఇది ప‌క్కా ప్రతీకార చర్య అంటూ ఆగ్రహం
  • ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్ద‌రు కూడా ఉమ్మడి ఏపీ అభివృద్ధికి పాటుపడ్డార‌ని వెల్లడి
  • వారికి నీచ రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాద‌ని హిత‌వు

వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే... ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కూడా అదే బాటలో నడుస్తున్నారు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్‌' (ట్విట్టర్‌) వేదికగా కూటమి ప్రభుత్వం తీరును ఆమె త‌ప్పుబ‌ట్టారు. 

రాష్ట్రంలో మెడికల్ క‌ళాశాల‌లకు, ఆసుపత్రులకు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ అయినా, వైఎస్ఆర్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని, పాలనలో తమదైన ముద్ర వేశార‌ని ష‌ర్మిల గుర్తు చేశారు. వారిని రాజకీయాలకు అతీతంగానే చూడాలి తప్పితే... నీచ రాజకీయాలు ఆపాదించడం ఎంత‌వ‌ర‌కు సమంజసం? అని ప్ర‌శ్నించారు.

వైఎస్‌ఆర్ తీసుకువ‌చ్చిన‌ ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంటు, పెన్షన్లు ఇలా ప్రతీ పథకం దేశానికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఆయ‌న‌ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదని స్పష్టం చేశారు. తెలుగు వారి గుండెల్లో వైఎస్‌ఆర్ స్ధానం ఇప్పటికీ పదిలంగా ఉందని... వైసీపీ మీద ఉన్న కోపాన్ని ఆయ‌న‌ మీద రుద్దడం సరికాదని కూటమి ప్రభుత్వానికి హిత‌వు ప‌లికారు. వైసీపీలో వైఎస్‌ఆర్ లేడని, అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయిరెడ్డి పార్టీనే అని ష‌ర్మిల‌ విమర్శించారు.

  • Loading...

More Telugu News