PM Modi: ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి .. సీఎస్‌లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ప్రధాని మోదీ

pm modi video conference with state css

  • జాతీయ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ సమీక్ష
  • జల్ జీవన్ మిషన్, గ్యాస్ పైప్ లైన్, రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పధకాలతో పాటు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. తాగునీరు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం, జాతీయ రహదారులు, గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, అమృత్ -2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, నూతన పైపులైను నిర్మాణ ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని సిఎస్‌లను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ 2.0 (అమృత్ 2.0)కింద పట్టణాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులు, తాగునీటి వనరుల చుట్టూ పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధాని ఆదేశించారు.

  • Loading...

More Telugu News