Rao Ramesh: నన్ను పెట్టి సినిమా తీస్తే ఎవరొస్తారయ్యా అన్నాను: రావు రమేశ్

Rao Ramesh Interview

  • ఈ నెల 23న విడుదలైన 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
  • ఈ కథ తన దాహం తీర్చిందన్న రావు రమేశ్ 
  • కొంతకాలంగా సరైన రోల్స్ పడలేదని వెల్లడి 
  • రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చానని వ్యాఖ్య


రావు రమేశ్.. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన విలక్షణ నటుడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చాలా తక్కువ సినిమాలలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి రావు రమేశ్ ప్రస్తావించారు. "ఈ టైటిల్ చెప్పగానే వినడానికి బాగుంది అనుకున్నాను .. మిడిల్ క్లాస్ వారికి కనెక్ట్ అయ్యేలా ఉందని అనిపించింది. కామెడీ .. స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉన్నాయనే నమ్మకం కలిగింది. కాకపోతే .. నాతో సినిమా తీస్తే ఎవరొస్తారయ్యా అన్నాను. వస్తారనే నమ్మకం మాకుంది అని దర్శకుడు అన్నాడు. ఆ నమ్మకం మీకు ఉంటే ఓకే అన్నాను" అని చెప్పారు. 

" నిజానికి నేను ఆ మధ్య చాలా మంచి రోల్స్ చేశాను .. ఆడియన్స్ నా డైలాగ్స్ ను థియేటర్లో వదిలేయకుండా ఇళ్లకి పట్టుకుపోయేవారు. అలాంటిది రాన్రాను నేను చేసే పాత్రలలో విషయం పల్చబడుతుందేమో అనిపించింది. అందువలన వెయిట్ చేయడం మొదలుపెట్టాను. అలా రెండేళ్ల నుంచి దాహంతో ఉన్న నా దగ్గరికి ఈ కథ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది" అని అన్నారు. 

  • Loading...

More Telugu News