Fire Accident: హైదరాబాద్ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

fire accident in hyderabad

  • మంగళ్‌హాట్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం
  • అగ్నికి ఆహుతైన ఫర్నిచర్ గోదాంలోని సామాగ్రి 
  • మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది

హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లేపల్లి కూడలి సమీపంలో గల ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలోని సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. గోదాం నుండి మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు వెంటనే పోలీసు, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. 

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది? అనే విషయాలు తెలియాల్సి వుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

More Telugu News