BSNL: బీఎస్ఎన్‌ఎల్‌లో 150 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్

BSNL offering Rs 397 prepaid recharge plan with 150 days validity

  • రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌  
  • మొదటి 30 రోజులు దేశంలోని ఏ నంబర్‌కైనా అపరిమిత అవుట్ గోయింగ్ కాల్స్ సదుపాయం
  • రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు
  • ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్‌ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల మొబైల్ టారిఫ్‌ రేట్లను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వరంగ ఆపరేటర్ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్లాన్‌లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది.

రూ.397తో 150 రోజుల వ్యాలిడిటీ..
ఆకర్షణీయమైన రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్‌ఎల్ ఆఫర్ చేస్తోంది. ఒక ప్లాన్ వ్యాలిడిటీ 5 నెలలతో సమానంగా 150 రోజులుగా ఉంది. ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ మొదటి 30 రోజుల పాటు కస్టమర్లు దేశంలోని ఏ నంబర్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్ కోసం టాప్-అప్ రీచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రం 150 రోజుల పాటు కొనసాగుతూనే ఉంటాయి. 

మొదటి 30 రోజుల పాటు రోజువారీ 2జీబీ డేటా లభిస్తుంది. డేటా కోటా పూర్తయిన తర్వాత 40కేబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. అంతేకాదు మొదటి 30 రోజుల పాటు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. రెండవ సిమ్‌గా బీఎస్ఎన్ఎల్‌ను వాడుతున్నవారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది.

పునరుద్ధరణపై ఫోకస్..
కాగా మార్కెట్‌లో విస్తరించేందుకు బీఎస్ఎన్ఎల్ చర్యలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై సన్నాహాలు చేస్తోంది. ఇక బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రస్తుతం దేశంలోని అనేక ప్రధాన నగరాలు, టెలికాం సర్కిల్‌లలో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు అదనంగా 25,000 కొత్త 4జీ టవర్లను కూడా ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్‌ పునరుద్ధరణకు ఊతమిస్తూ ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం రూ.83,000 కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News