Road Accident: గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

Five dead in guvvalachruvu ghat road accident

  • వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరుపు ఘాట్ రోడ్డులో ఢీకొన్న కారు – కంటైనర్ 
  • కారులో ప్రయాణిస్తున్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు

వైఎస్ఆర్ జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు – కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో ఉన్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. కారులో ఉన్న వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

కాగా, రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్‌పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్‌పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్‌పీ వెంట ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ యు. వెంకటకుమార్, సి.కె దిన్నె సీఐ శంకర్ నాయక్, రామాపురం సీఐ వెంకట కొండారెడ్డి సిబ్బంది ఉన్నారు.

More Telugu News