kuwait: చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలి... ఓ మహిళ వీడియో

ap women selfie video from kuwait

  • కువైట్‌లో కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఇక్కట్లు
  • యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ ఆవేదన
  • ఇండియాకి వెంటనే తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన నాగమణి

పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తుండటంతో..ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కువైట్‌లో తన యజమాని చిత్ర హింసలు పెడుతున్నాడని, వెంటనే ఇండియాకి తీసుకురావాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన మహిళ నాగమణి సెల్ఫీ వీడియోలో వేడుకుంది. తన ఆరోగ్యం క్షీణించిందని, నోటి నుండి రక్తం వస్తున్నా యజమాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని తనను ఈ నరకం నుండి కాపాడాలని ఆమె వేడుకోవ‌డం వీడియోలో ఉంది. 

More Telugu News