Revenue Seminars: సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు: మంత్రి మండిపల్లి

Revenue seminars from Sep 1 in AP

  • కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సదస్సులకు హాజరు
  • రికార్డుల ట్యాంపరింగ్ పై ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందన్న మంత్రి
  • ఎన్టీఆర్ భవన్ లో నేడు ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ఏపీలో సెప్టెంబరు 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఈ సదస్సుల్లో పాల్గొంటారని వెల్లడించారు. గత ఐదేళ్లలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. కాగా, రెవెన్యూ సదస్సుల ద్వారా  ఆన్ లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై  ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News