Chandrababu: శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం మనదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu conveys wishes on Sri Krishna Janmashtami


నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. 

గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. 

ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా కటాక్షాలు రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News