KTR: 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి వెళ్తున్న కేటీఆర్

KTR going to Delhi with 20 MLAs

  • ఈ సాయంత్రం కీలక నేతలతో హస్తినకు వెళ్తున్న కేటీఆర్
  • రేపు కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు
  • బెయిల్ రాకపోతే ఢిల్లీలో బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. తనతో పాటు ఆయన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, పార్టీ కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. పార్టీ కీలక నేతలతో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనుండటం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఎందుకోసం ఢిల్లీకి వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది. 

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. కవిత బెయిల్ పై రేపు సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. 

ఈ కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలకు కూడా బెయిల్ వచ్చింది. దీంతో, కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. ఆమెకు ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో ఢిల్లీ వేదికగా సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశం ఉందని చెపుతున్నారు.

KTR
BRS
Delhi
K Kavitha
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News