KTR: రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి: కేటీఆర్

Time to admit there is a serious problem and declare a health emergency says KTR

  • రాష్ట్రంలో పెరుగుతున్న‌ డెంగీ మ‌ర‌ణాల‌పై ఎక్స్ వేదిక‌గా కేటీఆర్‌ ఆవేద‌న 
  • అస‌లు డెంగీ మ‌ర‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోందన్న మాజీ మంత్రి
  • వార్తా ప‌త్రిక‌ల్లో మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా క‌థ‌నాలు అంటూ ట్వీట్‌
  • డేటాను ఎవ‌రు, ఎందుకు దాచిపెడుతున్నారు..? అంటూ మండిపాటు 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెరుగుతున్న‌ డెంగీ మ‌ర‌ణాల‌పై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 'తెలంగాణ‌లో డెంగీ మ‌ర‌ణాలు లేవ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ, వార్తా ప‌త్రిక‌ల్లో మాత్రం ఒక్క‌రోజులో ఐదు మంది డెంగీతో చ‌నిపోయిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. డెంగీతో మ‌రో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు ఇవాళ కూడా వార్తా ప‌త్రిక‌ల్లో వార్త‌లు ఉన్నాయి. 

ఈ డేటాను ఎవ‌రు దాచిపెడుతున్నారు..? ఎందుకు దాచిపెడుతున్నారు..? అని కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రిపడా మందులు, బెడ్స్ లేవు. చాలా ఆసుప‌త్రుల్లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, న‌లుగురు రోగులు ఉండి చికిత్స పొందుతున్న దారుణ‌ప‌రిస్థితి' అని పేర్కొన్నారు. 

ఈ నేప‌థ్యంలో ఈ ప‌రిస్థితిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి శాంతికుమారిని కేటీఆర్ కోరారు. అలాగే వివిధ వార్తా ప‌త్రిక‌ల్లో డెంగీ మ‌ర‌ణాల‌పై ప్ర‌చురిత‌మైన క‌థ‌నాల తాలూకు క్లింపింగ్స్‌ను ఈ ట్వీట్‌కు కేటీఆర్ జ‌త చేశారు.

  • Loading...

More Telugu News