Visakha: మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఉత్పత్తి చేసిన ఏపీ మెడ్‌టెక్

india first monkeypox rt pcr kit launches from andhra pradesh medtech zone

  • దేశీయంగా తొలి మంకీపాక్స్ టెస్టింగ్ కిట్‌ను రూపొందించిన విశాఖ మెడ్‌టెక్ 
  • మంకీపాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్‌లకు అత్యవసర అంగీకారం తెలిపిన ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో
  • రెండు వారాల్లో మార్కెట్‌లోకి తీసుకువస్తామని చెప్పిన సీఈవో జితేంద్ర శర్మ

విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను సాధించింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన మెడ్‌టెక్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తొలి ఆర్టీ – పీసీఆర్ కిట్‌ను ఉత్పత్తి చేసింది. తమ భాగస్వామ్య ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో కలిసి ఎర్బాఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్‌టీ – పీసీఆర్ పేరుతో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది.

ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం మెడ్‌టెక్ ప్రకటించింది. ఈ కిట్ కు ఐసీఎంఆర్, సీడీఎస్‌సీవో నుండి అత్యవసర అంగీకారం లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఆరోగ్య రంగంలో మన దేశ ప్రతిభకు ఇదే తార్కాణమని మెడ్‌టెక్ సీఈవో జితేంద్ర శర్మ తెలిపారు. రెండు వారాల్లో ఈ కిట్ ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News